Jagdeep Dhankhar | భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తన పదవికి రాజీనామా చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధన్ఖర్ రాజీనామా దేశానికి తీరని లోటని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగదీప్ ధన్ఖర్ ఆసుపత్రిలో చేరినప్పుడు, నేను ఆయనకు సందేశాలు పంపాను. నాకు ఎప్పుడూ ఆయనతో చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన అత్యంత సమతుల్యత, జ్ఞానం, రాజకీయంగా అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన సభను నడిపించే తీరు అద్భుతం. ఇది చాలా పెద్ద లోటు. ఆయన రాజీనామా చేసినప్పటికీ, రాబోయే తరాలకు ఆయన మార్గదర్శనం చేయాలని నేను కోరుకుంటున్నాను. నా లాంటి వారు ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటాం. భవిష్యత్తులో ఆయన కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా, జగదీప్ ధన్ఖర్ వైద్య కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు సోమవారం రాత్రి ప్రకటించారు. 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ఖర్, 2027 వరకు పదవిలో ఉండాల్సి ఉంది.
VIDEO | On Jagdeep Dhankhar resigning as the Vice President of India, Andhra Pradesh Deputy CM Pawan Kalyan (@PawanKalyan) says, “When he was hospitalised, I had conveyed my messages to him. I’ve always had a very good interaction with him. He is a man of extreme balance, wisdom,… pic.twitter.com/JoO46IeDxf
— Press Trust of India (@PTI_News) July 22, 2025