Anushka Shetty | ఘాటీలో అనుష్క ఘాటైన పాత్ర
కెరీర్ బిగినింగ్లో గ్లామర్ పాత్రల్లో ఓ వెలుగు వెలిగింది అనుష్క. అయితే.. ‘అరుంధతి’ తర్వాత ఆమె నుంచి రెగ్యులర్ గ్లామర్ పాత్రలు కాకుండా, అభినయానికి ఆస్కారమున్న పాత్రల్నే ఆడియన్స్ ఆశించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె చేసిన వేదం, బాహుబలి ఫ్రాంచైజీ, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్ధం, మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి సినిమాలు ఆమెను నటిగా గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టాయి.
కెరీర్ బిగినింగ్లో గ్లామర్ పాత్రల్లో ఓ వెలుగు వెలిగింది అనుష్క. అయితే.. ‘అరుంధతి’ తర్వాత ఆమె నుంచి రెగ్యులర్ గ్లామర్ పాత్రలు కాకుండా, అభినయానికి ఆస్కారమున్న పాత్రల్నే ఆడియన్స్ ఆశించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె చేసిన వేదం, బాహుబలి ఫ్రాంచైజీ, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్ధం, మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి సినిమాలు ఆమెను నటిగా గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టాయి. ఆ వరుసలో ఆమె చేస్తున్న మరో వైవిధ్యమైన సినిమానే ‘ఘాటీ’.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఉత్తరాంధ్ర గంజాయి తోటల నేపథ్యంలో సాగే విభిన్న కథాచిత్రమని తెలుస్తున్నది. ఇందులో అనుష్క పాత్ర ఊహలకు అతీతంగా ఉంటుందని సమాచారం. ఇటీవల విడుదలైన టీజర్లో.. అనుష్క బస్లో ఓ వ్యక్తిని మర్డర్ చేసే సన్నివేశం సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. ైక్లెమాక్స్ షూట్ మాత్రమే మిగిలివుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తున్నది. జనవరి చివరివారం నుంచి ైక్లెమాక్స్ షూట్ ఉంటుందని తెలుస్తున్నది. ఏప్రిల్ 18న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు సంభాషణలు అందిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

