‘రవళి ప్రొఫెషనల్ చెఫ్‌గా పనిచేస్తుంటుంది. పెళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. మరోవైపు ఎన్ని కష్టాలెదురైనా సరే స్టాండప్ కమెడియన్‌గా సక్సెస్ కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు ఓ యువకుడు. వీరిద్దరికి అనుకోకుండా ఏర్పడిన పరిచయం స్నేహంగా మారుతుంది. మరి వీరి స్నేహం ఏ గమ్యానికి చేరిందో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు పి.మహేష్ కుమార్. ఆయన దర్శకత్వంలో అనుష్క, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి -మిస్టర్ పొలిశెట్టి’. యూవీ క్రియేషన్ సంస్థ నిర్మించింది.
శనివారం టీజర్‌ను విడుదల చేశారు. అనుష్క, నవీన్ పొలిశెట్టి ఇంటర్వ్యూ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో టీజర్ నవ్వుల్ని పండించింది. ‘సిట్యుయేషన్‌కు సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటా’ ‘నా కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ మేడమ్’ అంటూ నవీన్ పొలిశెట్టి చెప్పిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. చక్కటి వినోదంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నీరవ్‌షా, సంగీతం: రధన్, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, విక్రమ్, రచన-దర్శకత్వం: పి.మహేష్‌కుమార్.