పెళ్లికి ఇంకా టైముంది!
గత కొన్నేళ్లుగా సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటున్నది మలయాళీ సోయగం అనుపమ పరమేశ్వరన్. మహిళా ప్రధాన చిత్రాలతో పాటు ప్రధానస్రవంతి చిత్రాల్లో కథానాయికగా రాణిస్తూ సత్తా చాటుతున్నది.
గత కొన్నేళ్లుగా సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటున్నది మలయాళీ సోయగం అనుపమ పరమేశ్వరన్. మహిళా ప్రధాన చిత్రాలతో పాటు ప్రధానస్రవంతి చిత్రాల్లో కథానాయికగా రాణిస్తూ సత్తా చాటుతున్నది. తాజాగా ఈ భామ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘క్రేజీ కల్యాణం’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నది. తరుణ్‌భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, వీకే నరేష్ ప్రధాన పాత్రల్లో భద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా గురువారం అనుపమ పరమేశ్వరన్ విలేకరులతో సినిమా సంగతుల్ని పంచుకుంది. ఈ సినిమాలో తాను స్వతంత్య్ర భావాలు కలిగిన కీర్తి అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇదని పేర్కొన్నది. ఆమె మాట్లాడుతూ ‘తెలంగాణ పెళ్లి నేపథ్యంలో ఆద్యంతం వినోదప్రధానంగా సాగే చిత్రమిది. మా కేరళ వివాహ వేడుకల్లో పూర్తిగా శాకాహారమే వడ్డిస్తారు. కానీ తెలంగాణ పెళ్లిలో నాన్‌వెజ్ పెడతారని ఈ సినిమా ద్వారానే తెలుసుకున్నా.
ఈ కథలో పాత్రలన్నీ స్ట్రగుల్ పడుతుంటాయి. కానీ వాళ్ల కష్టాల నుంచే మంచి కామెడీ పుడుతుంది’ అని చెప్పింది. పెళ్లెప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు జవాబిస్తూ ‘నా పెళ్లి విషయంలో మా పెరెంట్స్ నుంచి ఎలాంటి ఒత్తిడిలేదు. ఇష్టమైనప్పుడు చేసుకో అంటున్నారు. నా పెళ్లికి ఇంకా టైముంది అనుకుంటున్నా’ అని చెప్పింది. ‘క్రేజీ కల్యాణం’లోని కీర్తి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని, ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నానని, అవన్నీ వేటికవే విభిన్నమైన పాత్రలని అనుపమ పరమేశ్వరన్ చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

