Ram charan: అనుభవించు రాజా టీజర్ విడుదల చేసిన రామ్ చరణ్

కెరీర్ మొదట్లో మంచి హిట్స్ అందుకుంటూ ప్రేక్షకులని అలరించిన రాజ్ తరుణ్ ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు.ప్రస్తుతం శ్రీను గవి రెడ్డి దర్శకత్వంలో ‘అనుభవించు రాజా’అనే చిత్రం చేస్తుండగా, ఈ చిత్రంలో కషీప్‌ఖాన్ హీరోయిన్గా నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది.
తాజాగా రామ్ చరణ్ చేతుల మీదుగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇందులో కోడి పందాలు ఆడే వ్యక్తిగా రాజ్ తరుణ్ కనిపిస్తున్నాడు. జాతర కోలాహలం మధ్య, కోడితో కలిసి పందేనికి సిద్ధమవుతున్నట్టుగా రాజ్ తరుణ్ కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే టీజర్ కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందుతున్నట్టు తెలుస్తుంది.
‘బంగారం గాడు ఊర్లో, వాడి పుంజు బరిలో ఉండగా ఇంకోకడు గెలవడం కష్టమే’అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. పోసాని కృష్ణమురళి, ఆడుగలమ్ నరేన్, అజయ్ సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవికృష్ణ, భూపాల్ రాజు, అరియానా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అతి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

