Ante Sundaraniki Movie | థియేటర్లోనే కాదు.. టీవీల్లోనూ ఆకట్టుకోలేకపోయిన ‘అంటే సుందరానికీ’..!
Ante Sundaraniki Movie TRP Rating | ఫలితంతో సంబంధంలేకుండా కొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు నాని. ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన అంటే సుందరానికీ విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.
Ante Sundaraniki Movie TRP Rating | ఫలితంతో సంబంధంలేకుండా కొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు నాని. ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈయన నటించిన అంటే సుందరానికీ విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోయింది. నాని గత సినిమాలతో పోల్చితే ఈ చిత్రం లోయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకువచ్చింది. చివరిగా ఈ చిత్రం బడ్జెట్లో సగం కూడా రికవరీ చేయలేకపోయింది. అంతేకాకుండా ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోపే థియేటర్లో నుండి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అంటే సుందరానికీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే అ సినిమా మరో చెత్త రికార్డును క్రియేట్ చేసింది.
అంటే సుందరానికీ సినిమా అత్యల్ప టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 2న జెమిని టీవీలో ప్రసారమైంది. కాగా ఈ సినిమా కేవలం 1.88 టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేసింది. నాని కెరీర్లోనే ఈ సినిమా అత్యల్ప టీఆర్పీను సాధించింది. థియేటర్లోనే కాదు టీవిల్లోనూ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. నానికి జోడీగా నజ్రియా ఫాహద్ హీరోయిన్గా నటించింది. నాని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. నాని గత నాలుగైదు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేకపోయాయి. ప్రస్తుతం నాని తన జోనర్‌కు భిన్నంగా దసరా అనే అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటుంది.
Read Also:
అరుదైన అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్.. తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు
Sai Rajesh | లగ్జరీ కారును బహుమతిగా పొందిన ‘హృదయ కాలేయం’ దర్శకుడు
Rishab Shetty | రిషబ్ శెట్టికి తెలుగులో ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట.. ఎందుకో తెలుసా?
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

