పెండ్లి సంబంధం కుదిరింది
టాలీవుడ్లో మరో హీరో బ్యాచ్‌లర్ లైఫ్నకు ముగింపు పలుకుతున్నారు. హీరో శర్వానంద్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నేత మనవరాలిని ఆయన పెండ్లి చేసుకోబోతున్నారు.
టాలీవుడ్లో మరో హీరో బ్యాచ్‌లర్ లైఫ్నకు ముగింపు పలుకుతున్నారు. హీరో శర్వానంద్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నేత మనవరాలిని ఆయన పెండ్లి చేసుకోబోతున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇరు కుటుంబాల పెద్దలు ఈ సంబంధం కుదిర్చారు. వధువు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. ఈ నెల 26 శర్వానంద్ నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం. వేసవిలో ఆయన పెండ్లి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఉంటుందని తెలుస్తున్నది. మరికొద్ది రోజుల్లో వీరి వివాహానికి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. గతేడాది ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు శర్వానంద్. ఆయన ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

