సౌతిండియాలో లేడీ సూపర్‌స్టార్ అంటే ఠపీమని చెప్పే పేరు నయనతార. హీరోయిన్లలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న స్టార్ కూడా తనేనని టాక్. దక్షిణాది భాషలన్నింటిలో విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ, రీసెంట్గా ‘జవాన్’తో బాలీవుడ్లో కూడా విజయకేతనం ఎగురవేసింది. అక్కడ కూడా లెక్కకు మించిన అవకాశాలు నయన్‌ని పలకరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ లేడీ సూపర్‌స్టార్ తన 75వ చిత్రంలో నటిస్తున్నది. ఈ ల్యాండ్‌మార్క్ మూవీని ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. లేడీ ఓరియెంటెడ్ కథాంశంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘అన్నపూరాణి’ అనే పేరును ఖరారు చేశారు. ‘ది గాడెస్ ఆఫ్ టేస్ట్’ అనేది ఉపశీర్షిక. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. ఇందులో అగ్నిహోత్రంలాంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయిగా నయన్ కనిపిస్తున్నది. నాన్న, నాయనమ్మ పూజాపునస్కారాలతో తరిస్తుంటే, తను మాత్రం బుక్‌లో చికెన్ లెగ్ పీస్‌ల బొమ్మల్ని చూస్తూ నోరు ఊరించుకుంటూ కనిపిస్తున్నది. దీన్నిబట్టి ఇది కామెడీ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రం ద్వారా నీలేష్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇదిలావుంటే, నయన్ సౌందర్య ఉత్పత్తుల మార్కెట్లోకి కూడా ఎంటరైంది. తన కాస్మొటిక్స్‌లో కెమికల్స్ తక్కువగా, ప్రకృతిసిద్ధ పదార్థాలు ఎక్కువగా ఉంటాయని, సౌందర్యం కోసం తాను వాడేవాటినే కస్టమర్లకు కూడా అందిస్తానని నయన చెబుతున్నది. డ్యూయెల్‌రోల్ అనమాట.