Annapoorani Movie | నయనతార ‘అన్నపూరణి’ విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే.?
Nayanthara | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’(Jawan). ఈ సినిమాతోనే నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్‌ని అందుకుంది తమిళ లేడి సూపర్ స్టార్ నయనతార. అయితే ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తాజాగా మరో సినిమా అనౌన్స్ చేసింది. నీలేష్ కృష్ణ (Nilesh Krishna) అనే కొత్త దర్శకుడితో నయనతార చేస్తున్న కొత్త చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani).
Nayanthara | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’(Jawan). ఈ సినిమాతోనే నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్‌ని అందుకుంది తమిళ లేడి సూపర్ స్టార్ నయనతార. అయితే ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తాజాగా మరో సినిమా అనౌన్స్ చేసింది. నీలేష్ కృష్ణ (Nilesh Krishna) అనే కొత్త దర్శకుడితో నయనతార చేస్తున్న కొత్త చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నయన్ కెరీర్లో 75వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుడగా.. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం విడుదల తేదీ ప్రకటించింది. ఈ సినిమాను డిసెంబర్ 01న విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనితో పాటు సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను వదిలింది. ఈ పోస్టర్లో డైనింగ్ టేబుల్‌పై నాన్ వెజ్ ఫుడ్ ఉండగా.. దాని ముందు నయన్ నిలుచుని ఉంది.
#Annapoorani releasing worldwide on Dec 1st 🎥 #AnnapooraniFromDec1st pic.twitter.com/mFs3QkLbmB
— Nayanthara✨ (@NayantharaU) October 31, 2023
రీసెంట్గా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ చూస్తే.. సంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిగా నయనతార ఇందులో కనిపిస్తుంది. ఫ్యామిలీ అంతా పూజా కార్యక్రమాలతో నిమగ్నమై ఉంటే.. నయన్ చదువుకుంటున్నట్లు బిల్డప్ ఇస్తూ.. చికెన్ కాబాబ్లను తినాలని ఆశగా చూస్తున్నట్లు ఉంది. ఇక మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

