Annapoorani Movie | విడుదలైన నాలుగు రోజులకే ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న నయనతార ‘అన్నపూరణి’
Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నయన్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రాన్ని ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నయన్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రాన్ని ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నీలేష్ కృష్ణ (Nilesh Krishna) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక పాజిటివ్ టాక్‌తో ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో స్క్రీనింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు కూడా కాకముందే ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 వేదికగా డిసెంబర్ 31 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం అయితే దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ సినిమా కథలోకి వెళితే.. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నయనతార ఒక ప్రొఫెషనల్ చెఫ్‌గా మారాలనుకుంటుంది. ఈ క్రమంలో తనకు ఎదురైనా సవాళ్లు ఎంటి.. కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకుని దేశంలో బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా స్టోరీ.
ఇక మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

