Anjali | ఆ సీన్స్ చేసేటప్పుడు గందరగోళానికి గురయ్యా: అంజలి
‘కథను బట్టి పాత్రలుంటాయి. పాత్రలు పండితేనే కథ పండుతుంది. కాబట్టే పాత్రధారులు సాహసాలకు సిద్ధపడాలి, త్యాగాలు చేయాలి. అలా చేయలేనివాళ్లు ఆర్టిస్టులుగా పనికిరారు.’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది అందాలభామ అంజలి.
Anjali | ‘కథను బట్టి పాత్రలుంటాయి. పాత్రలు పండితేనే కథ పండుతుంది. కాబట్టే పాత్రధారులు సాహసాలకు సిద్ధపడాలి, త్యాగాలు చేయాలి. అలా చేయలేనివాళ్లు ఆర్టిస్టులుగా పనికిరారు.’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది అందాలభామ అంజలి. తాజాగా ‘బహిష్కరణ’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అంజలి.. ఓ ఇంటర్వ్యూలో కథలో పాత్రల ప్రాముఖ్యం గురించి, తన కెరీర్ గురించి, ‘బహిష్కరణ’లో చేసిన ఇంటిమేట్ సీన్స్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది.
‘సినిమా మీద ప్రేమతో ఈ రంగంలోకి వచ్చాను. నటన నాకు చాలా నేర్పింది. పాత్ర ప్రాధాన్యతను బట్టి నేను చేసిన హోమ్ వర్క్ నన్ను మనిషిగా మరోస్థాయిలో నిలబెట్టింది. ఓ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఓ పాత్ర కోసం డ్యాన్స్ నేర్చుకున్నాను. రీసెర్చ్ చేస్తూ ఉంటే జ్ఞానం ఆటోమేటిగ్గా పెరుగుతుందికదా. అందులో భయంకరమైన కష్టాలను అనుభవించిన సందర్భాలూ ఉన్నాయి. ‘నవరస’ అనే సిరీస్ చేసినప్పుడు కాస్ట్యూమ్స్ కారణంగా కొన్ని గంటలపాటు వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేదు.
ఆ నరకం వర్ణనాతీతం.’ అని తెలిపింది అంజలి. ‘బహిష్కరణ’లో ఇంటిమేట్ సీన్స్ గురించి మాట్లాడుతూ ‘నా లైఫ్‌లో అలాంటి సీన్స్ చేయడం ఇదే ప్రథమం. చేసేటప్పుడు కొంచెం గందరగోళానికి గురయ్యాను. నా పరిస్థితిని గమనించి, లొకేషన్లో ఉన్న వాళ్లందర్నీ బయటకు పంపి ఆ సీన్స్ తీశారు. పాత్రకోసం చేశాను. అది నటిగా నాధర్మం. అలాగే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లోని నా పాత్ర కోసం కూడా చాలా కష్టపడ్డా. పాత్రకైతే న్యాయం చేయగలంకానీ.. ఫలితం మన చేతిలో ఉండదు కదా.’ అంటూ చెప్పకొచ్చింది అంజలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

