Animal Movie | బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’(Animal) మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు కూడా అదే ఫామ్ కొనసాగిస్తుంది. ఈ సినిమా రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు వసూలు చేసింది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy Vanga) దర్శకత్వం వహించాడు. ఇక అర్జున్ రెడ్డి (Arjun reddy), కబీర్ సింగ్‌లతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన సందీప్.. యానిమల్ అంటూ రావడంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాతో కేవలం సౌత్‌లోనే రణబీర్‌కు వంద కోట్ల బొమ్మ అవుతుందనడంలో ఆశ్చర్యమే లేదు.
ఇక ‘యానిమల్’ సెకండ్ డే కలెక్షన్స్ చూస్తే.. వరల్డ్‌వైడ్‌గా రూ.236 కోట్లు వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే దాదాపు రూ.131 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మార్కెట్ వారీగా చూస్తే.. హిందీలో రూ.112 కోట్లు, తెలుగుకన్నడ, తమిళ్, మలయాళం కలిపి మొత్తంగా రూ.18 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం.
Rewriting the Script of Success 🔥🪓#AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar @VangaPranay… pic.twitter.com/ESD2y03Crt
— Animal The Film (@AnimalTheFilm) December 3, 2023
కథలోకి వెళితే.. విజయ్ (రణబీర్‌కపూర్) నాన్న పిచ్చోడు. చిన్నప్పట్నుంచీ తండ్రి అంటే అలవిమాలిన ప్రేమ. నాన్నే అతని ఓ సూపర్‌హీరో. కానీ తండ్రి నుంచి మాత్రం అతను ఆశించిన ప్రేమ దక్కదు. అయినా సరే నాన్నంటే మాత్రం పిచ్చి. తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు. తనవాళ్లకు ఏమైనా చిన్న సమస్య వచ్చినా వైల్డ్‌గా రియాక్టవుతుంటాడు. ఆ కారణంచేత తండ్రి కోపానికి గురవుతుంటాడు. ఇంట్లోవాళ్లకు ఇష్టంలేని పెళ్లి చేసుకొని కుటుంబానికి దూరమైన విజయ్, కొన్నాళ్ల తర్వాత భార్యాపిల్లలతో కలిసి తన ఇంటికి చేరుకుంటాడు. అప్పడే తెలుస్తుంది అతనికి తన తండ్రి ఆపదలో ఉన్నాడని. తన తండ్రిపై జరిగిన హత్యాప్రయత్నం గురించి తెలుసుకొని, దీనికి కారణమైన వాళ్లను వెతికి చంపాలనుకుంటాడు? ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన సమస్యలేంటి? అనుకున్నది ఎలా సాధించాడు? నాన్న ప్రేమను ఎలా పొందాడు? అనేది మిగితా కథ.