Anil Kapoor | ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ (Anil Kapoor) శుక్రవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనిల్ కపూర్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు.
అక్టోబర్ 06 అనిల్ కపూర్ నిర్మించిన ‘థాంక్యూ ఫర్ కమింగ్’ చిత్రం విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇక బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై థాంక్యూ ఫర్ కమింగ్ చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్, రియా కపూర్, అనిల్ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రియా కపూర్ భర్త కరణ్ బూలానీ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భూమితో పాటు షెహనాజ్ గిల్ (Shehanaz Gill), అనిల్ కపూర్ (Anil Kapoor), కుషా కపిల, నటాషా రస్తోగి ప్రధాన పాత్రలు షోషించారు.