Anikha Surendran | విజయ్ దేవరకొండతో చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన అనిఖా సురేంద్రన్
Anikha Surendran | బాలనటులుగా అలరించి, నాయికానాయకులుగా మెప్పించిన వాళ్ల సంఖ్య ఎక్కువే. ఆ జాబితాలో చేరనున్న మరో పేరు.. అనికా సురేంద్రన్. తమిళ, మలయాళ సినిమాల్లో బాలనటిగా మెరిసిన అనిక.. ‘బుట్ట బొమ్మ’తో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నది.
Anikha Surendran | బాలనటులుగా అలరించి, నాయికానాయకులుగా మెప్పించిన వాళ్ల సంఖ్య ఎక్కువే. ఆ జాబితాలో చేరనున్న మరో పేరు.. అనికా సురేంద్రన్. తమిళ, మలయాళ సినిమాల్లో బాలనటిగా మెరిసిన అనిక.. ‘బుట్ట బొమ్మ’తో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నది. ‘విశ్వాసం’ సినిమాలో ‘చిన్నారి తల్లి..’గా తెలుగువారిని అలరించిన అనిక తన గురించి చెబుతున్న కబుర్లు..

బాలనటిగా ప్రేక్షకులకు దగ్గరైనా.. హీరోయిన్గా నటించడం ప్రత్యేకమైన అనుభవం. నన్ను నేను తెరపై కొత్తగా చూసుకోవాలని ఆరాటపడుతున్నాను. తొలిసారి పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో నటించడం వల్ల కాస్త ఒత్తిడి కూడా ఉంది. అయినా నన్ను హీరోయిన్గా అభిమానులు ఎలా ఆదరిస్తారా? అన్నది తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.

‘బుట్టబొమ్మ’.. మలయాళ సినిమా ‘కప్పెల’ రీమేక్‌గా తెరకెక్కుతున్నది. ప్రారంభంలో తెలుగు భాష రాకపోవడం వల్ల చాలా ఇబ్బందిపడ్డాను. డైలాగులు తప్పుగా చెప్పేదాన్ని. కానీ, డైరెక్షన్ టీం నాకు అండగా ఉంటూ.. ఒక్కో పదాన్ని విడమర్చి నేర్పించారు. దాంతో నా పని సులువైంది. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటా.

నాకు నటన అంటే ఇష్టం. చిన్నప్పుడే మమ్ముట్టి, అజిత్, నయనతార, మమతా మోహన్‌దాస్ వంటి అగ్రతారలతో పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకునే అవకాశం లభించింది. వాళ్లంతా మంచి స్థాయిలో ఉన్నా తమ ప్రతిభను నిరూపించుకోవడానికి అనుక్షణం శ్రమిస్తూనే ఉంటారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయమిది.
‘క్వీన్’, ‘మా’ సిరీస్‌లు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదరణ పొందాయి. దర్శకుడు గౌతమ్ మీనన్‌తో పనిచేయడం చాలా సులభంగా, సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీకి ఉన్న ఆదరణ థియేటర్ కంటే తక్కువేం కాదు. ‘శక్తి’ నా మనసుకు చాలా దగ్గరైన పాత్ర.

తెరపై నటీనటులు ఎలా కనిపించాలనేది పూర్తిగా దర్శకుడి చేతిలో ఉంటుంది. కథల ఎంపికలో నన్ను ముందుగా ఆకర్షించేది ఎమోషన్‌గా ఉండే పాత్రలే. మనసును హత్తుకునే సన్నివేశాల్లో పూర్తిగా పాత్రలో లీనమైపోయి నటిస్తాను. అందుకే, ఉద్వేగాలు పండించగలననే నమ్మకం వచ్చింది.
మొదట్లో అయితే అన్ని విషయాలనూ సోషల్ మీడియా ద్వారా పంచుకునేదాన్ని. ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్నా. ప్రస్తుతం తెలుగులో ‘బుట్టబొమ్మ’, మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
విజయ్ దేవరకొండ, టోవినో థామస్‌తో నటించాలనుకుంటున్నా. బాగా ఇష్టమైన సినిమా ‘500 డేస్ ఆఫ్ సమ్మర్’. ఫోన్ ఎక్కువగా వాడతాను. ‘అట్టను చూసి పుస్తకాన్ని అంచనా వేయకూడదు’ అనే విషయాన్ని బాగా నమ్ముతా. నాకు స్ఫూర్తి.. అమ్మే!
Read More :
Surya Vashistta | త్రివిక్రమ్ గైడెన్స్ వల్లే బుట్టబొమ్మలో నటించా.. సూర్య వశిష్ట చిట్‌చాట్”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

