Anikha Surendran | సినిమా షూటింగ్ అంటే నాకు వెకేషన్‌లా ఉండేది : అనిఖా సురేంద్రన్ చిట్‌చాట్
కోలీవుడ్ భామ అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). ఈ మూవీ జనవరి 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో చిట్ చాట్ చేసింది అనిఖా సురేంద్రన్.
కోలీవుడ్ భామ అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జనవరి 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో చిట్ చాట్ చేసింది అనిఖా సురేంద్రన్. బుట్టబొమ్మ గురించి అనిఖా సురేంద్రన్ మాటల్లోనే..
బుట్టబొమ్మ ప్రాజెక్ట్‌లో ఎలా జాయిన్ అయ్యారు..?
నేను కప్పెల (ఒరిజినల్ వెర్షన్)సినిమా చూసిన వెంటనే మేకర్స్ నన్ను సంప్రదించారు. ఈ సినిమాలో నా పాత్రకు మంచి స్కోప్ ఉందనిపించడం.. ప్రత్యేకించి భావోద్వేగ పూరిత సన్నివేశాల్లో ఉత్తమంగా నటించే అవకాశం ఉండటం వల్ల రీమేక్‌లో నటించేందుకు ఒప్పుకున్నా.
మీ పాత్రకు మరింత మెరుగులు ఎలా దిద్దారు..?
బుట్ట బొమ్మలో నా పాత్ర పేరు సత్య. డైరెక్టర్ రమేశ్ సార్ నన్ను సహజంగా నటించమని చెప్పారు. నేను బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. ఒకసారి సినిమా విడుదలైతే కప్పెలలోని అన్నాబెన్ పాత్రకు నేను పోషించిన సత్య రోల్‌కు తేడా తెలుస్తుంది.
బాలనటి నుంచి హీరోయిన్గా మీ ప్రయాణం గురించి..
చాలా కాలంగా నేను ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పటి నుంచి నటనపరంగా ఎలాంటి తేడాలు గుర్తించలేదు. కెరీర్ తొలినాళ్లలో సినిమా షూటింగ్ అంటే నాకు వెకేషన్‌లా ఉండేది. కానీ ఇపుడు మాత్రం భిన్నంగా ఉంది. ఓ హీరోయిన్గా బీటీఎస్ వీడియోలు, ఇతర సన్నివేశాల్లో నన్ను నేను చూసుకున్నప్పుడు దశాబ్దకాలానికి పైగా నా నటనా కెరీర్లో తేడా గమనించాను. ఇండస్ట్రీలోని వివిధ భాషల్లో పెద్ద యాక్టర్లతో నటించే అవకాశాలు రావడం చాలా గర్వంగా ఉంది.
బాలనటి నుంచి హీరోయిన్గా మీ ప్రయాణం గురించి..
చాలా కాలంగా నేను ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పటి నుంచి నటనపరంగా ఎలాంటి తేడాలు గుర్తించలేదు. కెరీర్ తొలినాళ్లలో సినిమా షూటింగ్ అంటే నాకు వెకేషన్‌లా ఉండేది. కానీ ఇపుడు మాత్రం భిన్నంగా ఉంది. అయితే ఓ హీరోయిన్గా బీటీఎస్ వీడియోలు, ఇతర సన్నివేశాల్లో నన్ను నేను చూసుకున్నప్పుడు దశాబ్దకాలానికి పైగా నా నటనా కెరీర్లో తేడా గమనించాను. ఇండస్ట్రీలోని వివిధ భాషల్లో పెద్ద యాక్టర్లతో నటించే అవకాశాలు రావడం చాలా గర్వంగా ఉంది.
సూర్య, అర్జున్‌దాస్‌తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది..?
ఇద్దరు యాక్టర్లతో పనిచేస్తున్నపుడు సెట్స్ లో చాలా ఎంజాయ్ చేశా. అర్జున్ దాస్ కూడా తెలుగు ఇండస్ట్రీకి కొత్త. బుట్టబొమ్మలో వచ్చే డైలాగ్స్, ఇతర సన్నివేశాల కోసం మేమిద్దరం కలిసి పనిచేశాం. సూర్య సార్ విషయానికొస్తే ఆయన చాలా సహనం ఉన్న వ్యక్తి. షూటింగ్ టైంలో నాకు చాలా సహకరించారు.
కప్పెలతో పోలిస్తే బుట్టబొమ్మలో మార్పులున్నాయా..?
సినిమా కోర్ పాయింట్‌ను మార్చలేదు. కానీ డైరెక్టర్ రమేశ్ సార్ తెలుగు ప్రేక్షకుల అభిరుచులు, నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. సినిమా విడుదలైన తర్వాత తేడాలేంటో మీరు చూస్తారు. సినిమా నిర్మాణం చాలా భిన్నంగా, కలర్ఫుల్గా జరిగింది. స్క్రీన్‌ప్లేలో కూడా కొత్తదనాన్ని చూస్తారు.
మీ కొత్త సినిమాల గురించి..
నేను నటిస్తున్న మలయాళ సినిమా ఓ మై డార్లింగ్ వచ్చే నెలలో విడుదల కాబోతుంది. అంతేకాదు తమిళ సినిమా కూడా చేస్తున్నా. హిప్హాప్ ఆది లీడ్ రోల్లో నటిస్తున్నాడు. బుట్టబొమ్మ సెట్స్‌పై ఉన్న సమయంలో చాలా తెలుగు కథలు విన్నా. ఓ మంచి కథ నాకు నచ్చితే ఖచ్చితంగా చేస్తా. ఫీ మేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలనుంది.
అనిఖా సురేంద్రన్ ఇంటర్వ్యూ స్టిల్స్..
Candid clicks of beautiful #Buttabomma ~ #AnikhaSurendran ✨#ButtabommaTeaser – https://t.co/4JIT6xYOOt
In Cinemas From Jan 26th! 🤩@iam_arjundas #suryavashistta @shourie_t @NavinNooli @vamsi84 #SaiSoujanya @ganeshravuri @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/LcNemf9XFj
— Ramesh Bala (@rameshlaus) January 19, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

