Cinema News | తెలుగులో అప్పుడప్పుడు మల్టీస్టారర్ సినిమాలు పలకరించడం కామనే. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, గోపాల గోపాల, ఆర్ఆర్ఆర్, ఎఫ్2, వెంకీమామ.. ఇలా మల్టీస్టారర్స్ వస్తూనేవున్నాయి. రానున్న భారీ మల్టీస్టారర్ అంటే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘కల్కీ 2898 ఏడీ’. ఇందులో ప్రభాస్, కమల్‌హాసన్, అమితాబ్, దుల్కర్ ఇలా చాలామంది స్టార్లు నటిస్తున్నారు.
రాబోతున్న ‘ఎన్బీకే 109’ కూడా ఓ విధంగా మల్టీస్టారరే అనాలి. ఎందుకంటే అందులో బాలకృష్ణతో పాటు దుల్కర్సల్మాన్ కూడా నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్లో మల్టీస్టారర్‌కి తెరలేవనుంది. దుల్కర్ సల్మాన్, అడివి శేషు ఇందులో నటించే స్టార్లు. దర్శకుడు పరశురామ్ దగ్గర పనిచేసిన ఓ యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.