దీయరాజ్, ఇనయ సుల్త్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫ్రై డే’. ఈశ్వర్బాబు ధూళిపూడి దర్శకుడు. కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. అందర్నీ ఆకట్టుకునేలా ఈ థ్రిల్లర్ మూవీ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: రాజ్ మరియన్, కెమెరా: పృథ్వీ, సంగీతం: ప్రజ్వల్ క్రిష్, నిర్మాణం: శ్రీగణేశ్ ఎంటైర్టెన్మెంట్స్.