బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ధాకడ్ (Dhaakad). ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో కంగనా ఏజెంట్ అగ్ని పాత్రలో ఫుల్ యాక్షన్ మోడ్లో అన్ స్టాపబుల్ మిషన్తో అదరగొడుతోంది. నేడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ధాకడ్ నుంచి (She’s on Fire song) సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..కంగనారనౌత్, దివ్యాదత్తా, అర్జున్ రాంపాల్, ఇతన యూనిట్ మెంబర్స్ కు గుడ్ లక్ చెప్పాడు.
అయితే ఇలా పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే ఎవరూ ఊహించని విధంగా ఆ పోస్టును డిలీట్ చేశారు అమితాబ్ బచ్చన్. బిగ్ బీ సడెన్ గా ఇలా ఎందుకు పోస్టు డిలీట్ చేశాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. బాద్ షా కంపోజ్ చేసిన ఈ పాట షూటింగ్ అదిరిపోయేలా జరిగిందని తెలిపింది కంగనా. ఏజెంట్ అగ్ని పవర్, మిషన్లో ఎలా పాల్గొన్నది..తన లక్ష్యాన్ని చేరుకున్నదనేది పాట ప్రతిబింబిస్తుందని కంగనా చెప్పుకొచ్చింది.
మరి అమితాబ్ బచ్చన్ సాంగ్ ప్రోమోను షేర్ చేసినట్టే చేసి..ఎందుకు డిలీట్ చేశాడనేదానిపై ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని రజనీష్ ఘాయ్ (Razneesh Ghai) డైరెక్ట్ చేస్తున్నాడు. మే 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.