విజువల్ వండర్ కల్కి
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898’లో అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ‘కల్కి 2898’ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898’లో అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ‘కల్కి 2898’ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ చిత్రంలోని ‘బుజ్జి’ అనే వాహనాన్ని ఇటీవల పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘కల్కి 2898’ చిత్రంపై అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు.
దర్శకుడు నాగ్అశ్విన్ సృజనాత్మకత, అద్భుత ఆలోచనాశక్తి తనను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. ‘ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే భారీ విజయం తథ్యమనే భావన కలిగింది. ముఖ్యంగా కొన్ని సీన్స్ అద్భుతంగా అనిపించాయి. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇక బుజ్జి పాత్ర సినిమాలో మరో అద్భుతం’ అని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.
‘కల్కి ’ షూటింగ్లో పాల్గొన్న నాటి నుంచి సినిమాపై అమితాబ్‌బచ్చన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కమల్‌హాసన్, దీపికా పడుకోన్, దుల్కర్ సల్మాన్, దిశాపటానీ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

