Amitabh Bachchan | KBC 18 గ్రాండ్ రీఎంట్రీ.. రూ.7.5 కోట్ల కోసం మరోసారి అమితాబ్ పిలుపు.. ఆగస్టు 10 నుంచే ప్రారంభం!
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఐకానిక్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గేమ్ షో 18వ సీజన్ ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి "సోచ్నా పడేగా" అనే కొత్త థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుండగా, కేవలం సమాధానం తెలిసి ఉండటం మాత్రమే కాకుండా లోతుగా ఆలోచించే సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా గేమ్‌ను రూపొందించారు.
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఐకానిక్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గేమ్ షో 18వ సీజన్ ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి “సోచ్నా పడేగా” అనే కొత్త థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుండగా, కేవలం సమాధానం తెలిసి ఉండటం మాత్రమే కాకుండా లోతుగా ఆలోచించే సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా గేమ్‌ను రూపొందించారు. స్మార్ట్ఫోన్లు, గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ఏ ప్రశ్నకైనా క్షణాల్లో సమాధానం దొరుకుతోంది. అయితే ఈసారి KBCలో మాత్రం కేవలం సమాచారం గుర్తుపెట్టుకుంటే సరిపోదని, ప్రశ్న వెనుక ఉన్న లాజిక్‌ను అర్థం చేసుకుని ఆలోచించి సమాధానం చెప్పాల్సి ఉంటుందని మేకర్స్ వెల్లడించారు.
ఇటీవల విడుదలైన ప్రచార వీడియోల్లో అమితాబ్ బచ్చన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. “మీ ఫోన్లో ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకొచ్చు. కానీ KBC 18లో గెలవాలంటే ఆలోచించే తీరు ఉండాలి” అంటూ చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సీజన్లో నాలెడ్జ్‌తో పాటు విశ్లేషణాత్మక ఆలోచనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ వంటి విషయాలు చదివి రావడం ఒక్కటే సరిపోదని, పరిస్థితిని అర్థం చేసుకుని సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యమే విజయంలో కీలకమని తాజా ప్రోమోలు తెలియజేస్తున్నాయి.
2000లో ప్రారంభమైన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ భారత టెలివిజన్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రియాలిటీ షోలలో ఒకటిగా నిలిచింది. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఈ షోకు అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ ప్రధాన బలంగా మారింది. ఎనభై ఏళ్లు దాటిన వయసులోనూ ఆయన చూపిస్తున్న ఉత్సాహం ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. KBC సీజన్ 18 ఆగస్టు 10 నుంచి ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ ఛానెల్‌తో పాటు Sony LIV ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ షోను వీక్షించవచ్చు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు, ఆడిషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈసారి విజేతకు గరిష్ఠంగా రూ.7.5 కోట్ల ప్రైజ్ మనీ అందనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ షోపై భారీ ఆసక్తి నెలకొంది. కొత్త థీమ్, కొత్త తరహా ప్రశ్నలు, అమితాబ్ బచ్చన్ హోస్టింగ్‌తో KBC 18 మరోసారి టెలివిజన్ ప్రపంచంలో సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
Delimitation | మోదీ సర్కార్‌లో కొత్త ఆశలు.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు!
Nizamia Tibbi | శతాబ్దాల ఘనత ఢిల్లీకి వినపడలే.. అత్యంత పురాతన మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో.. అయినా గుర్తింపునకు నోచుకోలే!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

