Kalki 2898 AD | యంగ్ లుక్‌లో బిగ్‌బి.. అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన కల్కి టీమ్!
Kalki 2898 AD | ప్రభాస్ ( Prabhas ) ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న కల్కి 2892 ఏడీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ పాత్రను పరిచయం చేస్తూ ఒక టీజర్‌ను వదిలింది.
Kalki 2898 AD | ప్రభాస్ ( Prabhas ) ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న కల్కి 2892 ఏడీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ పాత్రను పరిచయం చేస్తూ ఒక టీజర్‌ను వదిలింది. ఐపీఎల్ ( IPL )మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ఈ టీజర్‌ను ప్రసారం చేసింది. అందులో యంగ్‌లుక్‌లో అమితాబ్ ( Amitabh Bachchan ) కనిపించడం ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది.
ఈ టీజర్లో ముసుగుతో ధ్యానం చేస్తున్న అమితాబ్ బచ్చన్ దగ్గరకు వచ్చిన ఓ బాలుడు.. నువ్వు చనిపోవా? నువ్వు దేవుడివా.. అసలు నువ్వు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు తన ముసుగును తొలిగించిన అమితాబ్.. ద్రోణాచార్యుడి ( Dronacharya ) కుమారుడు అశ్వత్థామ ( Ashwatthama)ను అని తన గురించి పరిచయం చేసుకుంటాడు. ఈ సమయంలో ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించి కొన్ని విజువల్స్‌ను చూపించారు. అందులో అమితాబ్ బచ్చన్ యంగ్ లుక్ కూడా ఉండటం అందర్నీ సర్ప్రైజ్ చేసింది. టెక్నాలజీ సాయంతో అమితాబ్‌ను యంగ్‌గా చూపించినట్లు తెలుస్తోంది. కాగా, కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర శివుడిని పోలి ఉంటుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే ఈ టీజర్లో అమితాబ్‌కు మూడో కన్ను ఉన్నట్లుగా చూపించడం గమనార్హం. మొత్తమ్మీద ఈ విజువల్స్ సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి.
Here’s the awaited glimpse of #Kalki2898AD#Prabhas #AmitabhBachchan pic.twitter.com/E70ABars5J
— Shreyas Media (@shreyasgroup) April 21, 2024
నాగ్ అశ్విన్ ( Nag Ashwin ) దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణె ( Deepika Padukone ), దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని మే 9వ తేదీన విడుదల చేస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. కానీ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్త రిలీజ్ డేట్‌పై చిత్ర బృందం త్వరలోనే క్లారిటీ ఇస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీనిపై చిత్ర యూనిట్ స్పందించలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

