Nayanthara | విడాకుల రూమర్స్‌కు మరోసారి చెక్.. నా బాయ్స్‌తో కలిసి ప్రయాణం అంటూ ఫొటో షేర్ చేసిన నయనతార
Nayanthara | విడాకుల రూమర్స్‌కు మరోసారి చెక్ పెట్టింది లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara). భర్త, పిల్లలతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోను తాజాగా షేర్ చేసింది (Flight Pic) .
Nayanthara | విడాకుల రూమర్స్‌కు మరోసారి చెక్ పెట్టింది లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara). భర్త, పిల్లలతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోను తాజాగా షేర్ చేసింది (Flight Pic) . ‘చాలా కాలం తర్వాత నా బాయ్స్‌తో కలిసి ప్రయాణం చేస్తున్నా’ అంటూ ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టింది. ఈ ఫొటోల్లో నయన్ ఓ కొడుకు, విఘ్నేష్ (Vignesh Shivan) మరో కొడుకును ఎత్తుకుని ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించారు. విడాకుల పుకార్ల మధ్య నయన్ పోస్ట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ‘వావ్.. క్యూట్ ఫ్యామిలీ’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఒక్కపోస్ట్‌తో విడాకుల రూమర్స్ (Divorce Rumours)కు చెక్ పెట్టినట్లైంది.
కోలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో నయన్ – విఘ్నేష్ జంట ఒకటి. దాదాపు ఏడేళ్ల ప్రేమ అనంతరం వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరు కవల పిల్లలకు కూడా తల్లిదండ్రులయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ అటు ప్రొఫెషనల్ లైఫ్‌ను ఇటు ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్న సమయంలో వీరి విడాకుల రూమర్స్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన నయన్.. ఉన్నట్టుండి తన భర్త విగ్నేష్ శివన్‌ను అన్ ఫాలో చేయడంతో అసలు రచ్చ మొదలైంది.
దానికి తోడు ఉబికి వస్తున్న కన్నీళ్లు మాత్రమే ఆమెకు సొంతం అంటూ ఒక ఇంగ్లీష్ కొటేషన్ కూడా పెట్టింది. ఇంకేముంది నయనతార విడాకుల వైపు అడుగులు వేస్తోందంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. దీంతో నయనతార అభిమానులు గందరగోళానికి గురయ్యారు. వాతావరణం వేడిగా మారడంతో నయన్ కల్పించుకోక తప్పలేదు. రూమర్లకు చెక్ పెడుతూ ఇన్‌స్టాలో విఘ్నేష్‌ను ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. విఘ్నేష్ కూడా ఆమె ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. దీంతో గాలివార్తలు రాసే రూమర్లవాళ్లంతా నిశ్శబ్దం అయిపోయారు.
Also Read..
Dolly Sohi | గర్భాశయ క్యాన్సర్‌తో టీవీ నటి మృతి
Pushpa The rule | క్రేజీ టాక్.. పుష్ప ది రూల్‌లో పాపులర్ బాలీవుడ్ యాక్టర్..!
Odela 2 | ఓదెల 2లో శివశక్తిగా తమన్నా.. మహాశివరాత్రి స్పెషల్ పోస్టర్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

