Power Star | టాలీవుడ్లో ఫస్ట్ పవర్ స్టార్ ఎవరు.. వైరల్‌గా మారిన అమెరికన్ నటి ట్వీట్
Power Star | ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన అమెరికన్ నటి రెబెకా గ్రాంట్ ( Rebecca grant ).. ప్రశంసించకుండా ఉండలేకపోయింది. ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించింది. తెలుగు నటులను పొగుడుతూనే.. టాలీవుడ్ గురించి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Power Star | బాహుబలి సినిమాతో టాలీవుడ్ స్టామినా ఏంటో దేశమంతా తెలిసింది. ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు చిత్ర సీమ సత్తా ప్రపంచమంతా పాకింది. ఈ సినిమాలతో ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. విదేశీయులు కూడా మనవాళ్ల యాక్టింగ్‌ను చూసి మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన అమెరికన్ నటి రెబెకా గ్రాంట్ ( Rebecca grant ).. ప్రశంసించకుండా ఉండలేకపోయింది. ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించింది. తెలుగు నటులను పొగుడుతూనే.. టాలీవుడ్ గురించి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
Before there was mega power star #RamCharan𓃵 and #Prabhas𓃵, who were the power stars in #Telugu films?
How did #RRRmovie become such a breakout hit around the world? Im so happy I saw it!
— Rebecca Grant (@rebeccagrants) October 25, 2022
ట్రిపుల్ ఆర్ మూవీ తనకెంతో నచ్చిందని.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సక్సెస్ కావడం తనకెంతో సంతోషంగా ఉందని అమెరికన్ రెబెకా క్రాంట్ తెలిపింది. అంతటితో ఆగకుండా ప్రభాస్, రామ్‌చరణ్ కంటే ముందు తెలుగు సినిమాలకు పవర్ స్టార్ ఎవరో చెప్పండి అంటూ రెబెకా ట్వీట్ చేసింది. దీనికి చాలామంది నెటిజన్లు స్పందించారు. ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ వీళ్లందరి కంటే ముందు చిరంజీవినే పవర్ స్టార్ అని బదులిచ్చారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని స్వయం కృషితో పైకి ఎదిగాడని.. ఆయన గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.
Was @KChiruTweets a power mega star in #India before #Prabhas𓃵 and #RamCharan𓃵?
Which movie should I watch of his that might have English subtitles?
— Rebecca Grant (@rebeccagrants) October 25, 2022
నెటిజన్లు చేసిన కామెంట్లకు రెబెకా కూడా స్పందించింది.ప్రభాస్, రామ్‌చరణ్ కంటే ముందు ఇండియాలో చిరంజీవినే పవర్ మెగాస్టార్ అయితే.. నేను ఆయన సినిమాలను చూడాలనుకుంటున్నాను. ఆయన నటించిన ఏవైనా సినిమాలకు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ ఉంటే చెప్పగలరు అంటూ మరో ట్వీట్ చేసింది. దీనికి మెగాస్టార్ చిరంజీవిని కూడా ట్యాగ్ చేసింది. దీనికి కూడా మెగా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. తమకు తోచిన చిరు హిట్ చిత్రాల పేర్లకు సూచిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
I ❤️ Power Star #pawankalyan 🔥🔥movies
— Rebecca Grant (@rebeccagrants) September 4, 2022
ఇదిలా ఉంటే గతంలో కూడా రెబెకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేయడం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే తనకు ఇష్టమని గత నెల 4వ తేదీన ఆమె ట్వీట్ చేసింది. ఏదేమైనా మన తెలుగు నటుల గురించి హాలీవుడ్ వరకు వెతకడం ఎంతైనా గర్వించదగిన విషయమే కదా!
Read More :
“Chiranjeevi | బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. చిరంజీవి కీలక వ్యాఖ్యలు”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

