నిజాలే మాట్లాడుతా!

ఎవరేమనుకున్నా సరే తాను నిజాల్ని నిర్భయంగా చెబుతానని అంటోంది చెన్నై చిన్నది శృతిహాసన్. వ్యక్తులు, వ్యవస్థల్లో తాను నిజాయితీని, స్వచ్ఛతను ఆశిస్తాను కాబట్టే నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తానని పేర్కొంది. తాను మాట్లాడిన మాటల్ని చాలాసార్లు మీడియాలో వక్రీకరించారని, అయినా ఎప్పుడు భయపడలేదని స్పష్టం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘మా అమ్మనాన్న విడాకులు తీసుకొని వేరుగా ఉండటంపై నా అభిప్రాయం ఏంటని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో అడిగారు. వ్యక్తిగత స్వేచ్ఛను, సంతోషాన్ని వెతుక్కునే క్రమంలో వాళ్లు విడిపోయారు కాబట్టి ఆనందంగా ఉందని చెప్పాను. పేరెంట్స్ విడిపోతే కూతురు ఆనందంగా ఉందంటూ నా మాటల్ని తప్పుగా రాశారు. ఆ వార్తలు నన్ను బాధించాయి. సెన్సేషన్ కోసం నా మాటల్ని వక్రీకరించారనుకొని ఊరుకున్నా. ఇలాంటి చర్యలతో నిజాలు మాట్లాడే నా తత్వాన్ని ఎవరూ ఆపలేరు’ అని శృతిహాసన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు చిత్రసీమ అంటే తనకు ఎనలేని గౌరవమని, విధి తనను తెలుగు ప్రేక్షకుల ప్రేమకు అర్హురాలిని చేసిందని శృతిహాసన్ భావోద్వేగంగా స్పందించింది. ఈ ఏడాది టాలీవుడ్లో ‘క్రాక్’ ‘వకీల్‌సాబ్’ చిత్రాలతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని శృతిహాసన్ పేర్కొంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

