Allu arjun | ఈసారి థియేటర్‌కి రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి.. ‘శివ’ రీ రిలీజ్‌పై అల్లు అర్జున్ వీడియో
Shiva Re Release | రామ్ గోపాల్ వర్మ – నాగార్జున కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం శివ. ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. నవంబర్ 14న ఈ సినిమా రీరిలీజ్ కానుంది.
Shiva Re Release | రామ్ గోపాల్ వర్మ – నాగార్జున కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం శివ. ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. నవంబర్ 14న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శివ సినిమా రోజులను గుర్తుచేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్న విషయం తెలిసిందే ఇప్పటికే అగ్ర దర్శకులు శేఖర్ కమ్ములతో పాటు బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఈ సినిమాపై స్పందిస్తూ వీడియోలు విడుదల చేశారు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాపై స్టార్ నటుడు అల్లు అర్జున్ స్పందించాడు.
టాలీవుడ్ సినీ చరిత్రను మార్చిన శివ సినిమా వచ్చి దాదాపు 36 ఏండ్లు అవుతుంది. ఈ చిత్రం టాలీవుడ్ నుంచి వచ్చిన ఐకానిక్ చిత్రాలలో ఒకటి. ఈ ఒక్క సినిమా తర్వాత టాలీవుడ్‌తో పాటు భారతీయ సినిమా పరిశ్రమలో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాంటి సినిమా మళ్లీ రీ రిలీజ్ కాబోతుంది. ఈ రీ రిలీజ్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలి. అక్కినేని అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులకు నా నుంచి ఒక విజ్ఞప్తి.. ఈసారి థియేటర్‌కి రెండు లారీల పేపర్లను తీసుకెళ్లండంటూ అల్లు అర్జును చెప్పుకోచ్చాడు. అయితే అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన నాగార్జున ‘డియర్ అల్లు అర్జున్ (Allu Arjun).. రెండు లారీల థాంక్స్..’ అంటూ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.
Dear @alluarjun rendu lorryla thanks to you !!!💥💥💥#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

