Pushpa OTT | ‘పుష్ప’ సినిమాను అంత త్వరగా ఓటీటీలో ఇచ్చేస్తున్నారా..?
Pushpa OTT | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ( Pushpa ) . అన్ని భాషల్లోనూ ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది.

Pushpa OTT | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ( Pushpa ) . అన్ని భాషల్లోనూ ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ సినిమా. అన్నింటికీ మించి ఏపీలో టికెట్ రేట్ల సమస్యతో పాటు కొత్తగా ఇప్పుడు కరోనా కేసులు కూడా పెరగడంతో సినిమా వసూళ్ల పై ప్రభావం భారీగా పడింది. డిసెంబర్ 17న పుష్ప సినిమా విడుదలైంది.. అంటే ఇప్పటికి దాదాపు 18 రోజులు గడిచిపోయింది. ఇప్పటికీ ఈ సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. హిందీలో అయితే అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొస్తున్నాడు పుష్ప.
ఎవరూ ఊహించని రీతిలో హిందీలో 60 కోట్ల మార్కు అందుకుంది ఈ సినిమా. త్వరలోనే 75 కోట్ల వైపు పరుగులు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పుష్ప ఓటీటీ ( OTT ) విడుదలపై ఒక క్లారిటీ వచ్చింది. సాధారణంగా పెద్ద సినిమాలకు కనీసం 50 రోజుల గ్యాప్ ఉంటుంది. అయితే నిర్మాతలు సినిమాని అమ్మేటప్పుడు చేసుకునే అగ్రిమెంట్ బట్టి కొన్ని సినిమాలు మూడు నాలుగు వారాల్లోనే డిజిటల్ మీడియా వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తాయి. అందులో కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప విషయంలో కూడా ఇదే జరుగుతుందని తెలుస్తోంది.
సినిమా కలెక్షన్స్ ఇప్పటికీ బాగానే ఉన్నా కూడా.. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాత ఓటిటిలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ( Amazon prime ) వీడియో మంచి రేటు ఇచ్చి సొంతం చేసుకుంది. అయితే తెలుగు వర్షన్ ఆహాలో స్ట్రీమ్ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. తమిళ కన్నడ మలయాళ హిందీ వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే రోజు తెలుగు వర్షన్ కూడా ఆహాలో విడుదలవుతుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రేక్షకులకు అంతకంటే పెద్ద సర్ప్రైజ్ మరొకటి ఉండదు. ఎందుకంటే దీని కంటే రెండు వారాల ముందు విడుదలైన బాలకృష్ణ అఖండ సినిమా ఇంకా ఓటిటిలో విడుదల కాలేదు.
ఇవి కూడా చదవండి..
Pushpa Deleted Scene | పుష్ప డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్ను ఎందుకు డిలీట్ చేశారో తెలుసా?
Mohanbabu Letter | ‘మనకెందుకు అని మౌనంగా ఉండాలా..?’ మోహన్ బాబు లేఖ వైరల్
మోహన్ బాబు రాసిన లేఖ ఎవరిని ఉద్దేశించనది?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

