Allu Arjun | నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కి ఊరట
Allu Arjun | సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun)కి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్‌కి అప్లయ్ చేసిన అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
Allu Arjun | సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun)కి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్‌కి అప్లయ్ చేసిన అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిబంధనను కోర్టు మినహాయించింది. అలాగే విదేశాలకు వెళ్లేందుకు కూడా అల్లు అర్జున్‌కి కోర్టు అనుమతినిచ్చింది.
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చగా.. అతడికి 14 రోజు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించగా.. తెలంగాణ హైకోర్ట్ మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో బెయిల్ మీద బయటికి వచ్చాడు బన్నీ. అయితే రీసెంట్గా బెయిల్ గడువు కూడా ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం ఆప్లయ్ చేసుకోగా.. నాంపల్లి కోర్టు బన్నీకి పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

