తెలుగు సినీచరిత్రలో ఉత్తమనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తొలి హీరో అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాకు గాను ఆయన జాతీయ ఉత్తమనటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా బన్నీ మరో అరుదైన గౌరవాన్ని పొందారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించే అద్భుతమైన అవకాశం అల్లు అర్జున్‌ని వరించింది.
ఈ సందర్భంగా బెర్లిన్‌లో జరిగే 74వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొనేందుకు గురువారం జర్మనీ వెళ్లారు బన్నీ. ఇది నిజంగా బన్నీ కెరీర్లో హిస్టారికల్ మూమెంట్ అని చెప్పాలి. ఇదిలావుంటే.. ఆయన నటిస్తున్న ‘పుష్పా2’ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానున్న విషయం తెలిసిందే.