కలలోనే కటౌట్స్ కడతాం!
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. సురభి, రాశిసింగ్, విష్ణుప్రియ, ప్రిషాసింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది.
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. సురభి, రాశిసింగ్, విష్ణుప్రియ, ప్రిషాసింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం టైటిల్సాంగ్ను విడుదల చేశారు. ‘మా ఊరు ఎక్కడో స్వర్గమండీ..అది ఆకాశం అంచునా ఉంటదండీ, అరే దిగివచ్చా పండగే చేసుకోండి, నీ కోసం ఇక్కడే కోట్లమంది..తెగపడి చస్తా ఉంటరే భక్తులండీ..కల్లోనే కటౌట్స్ కడతామండీ’ అంటూ హుషారుగా ఈ పాట సాగింది.
కథానాయికల నృత్యాలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఇప్పటివరకు తాను చేసిన చిత్రాల్లో ఇదొక విభిన్న ప్రయత్నమని రాశిసింగ్ ఆనందం వ్యక్తం చేసింది. హుషారుగా సాగే ఈ గీతం అందరితో డ్యాన్స్ చేయించేలా ఉంటుందని, ఆద్యంతం కామెడీతో ఈ సినిమా నవ్వుల్ని పంచుతుందని ప్రిషాసింగ్ పేర్కొన్నది. ఈ కథ మొత్తం రంభ, ఊర్వశి, మేనక చుట్టూ తిరుగుతుందని, రెండున్నరగంటల పాటు హాయిగా నవ్వించే సినిమా ఇదని విష్ణుప్రియ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: చైతన్భరద్వాజ్, దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

