Allari Naresh 60th Movie | సినీయర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో హాస్యాస్పద సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేష్. ఏడాదికి రెండు మూడు సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. యువ దర్శక, నిర్మాతలకు కామెడీ జోనర్లో సినిమా చేయాలంటే మొదట గుర్తొచ్చే పేరు అల్లరి నరేష్. అంతలా ఈయన తన నటన, కామెడీ టైమింగ్తో రెండు గంటలు హాయిగా నవ్వుకునేలా చేస్తాడు. చాలా కాలం తర్వాత ‘నాంది’ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. పవర్ ప్యాకుడ్ పర్ఫార్మెన్స్తో అల్లరి నరేష్ ప్రేక్షకులను ఫిదా చేశాడు. అంతేకాకుండా దాదాపు దశాబ్ధ కాలం తర్వాత పూర్తి స్థాయి సీరియస్ పాత్రలో నటించి మెప్పించాడు. కమర్షియల్గా కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. విజయ్ కనకమేడల దర్శకత్వ ప్రతిభకు గొప్ప ప్రశంసలు దక్కాయి.
ఇదిలా ఉంటే ఈ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. లేటెస్ట్గా మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో సంకెళ్ళతో బంధించిన రెండు చేతులను నీడలో పక్షిలా చూపుతూ సినిమాపై ఆసక్తిని పెంచారు. ఈ సారి కూడా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలోనే వీళ్ళ కాంబోలో సినిమా తెరకెక్కతుందని పోస్టర్ను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్ సభకు నమస్కారం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం సినిమాలలో నటిస్తున్నాడు.
𝐓𝐡𝐞𝐬𝐞 𝐒𝐡𝐚𝐜𝐤𝐥𝐞𝐬 𝐈'𝐯𝐞 𝐌𝐚𝐝𝐞
𝐈𝐧 𝐚𝐧 𝐀𝐭𝐭𝐞𝐦𝐩𝐭 𝐭𝐨 𝐛𝐞 𝐅𝐫𝐞𝐞Embrace the #ShadowOfHope and Shower all your blessings for our new Endeavour 🤩❤️
🌟ing ACTOR @allarinaresh & directed by @VijayKKrishna#NareshVijay2 @sahugarapati7 @harish_peddi pic.twitter.com/UdIzMGZQne
— Shine Screens (@Shine_Screens) June 27, 2022