Ugram Movie Shooting | చాలా కాలం తర్వాత ‘నాంది’ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు అల్లరి నరేష్. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే అల్లరి నరేష్..నాందీతో పూర్తి స్థాయి సీరియస్ పాత్రలో నటించి విమర్శకులు నుండి గొప్ప ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలో నరేష్ తన విలక్షమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించి అల్లరి నరేష్ మార్కెట్‌ను పెంచింది. విజయ్ కనకమేడల దర్శకత్వ ప్రతిభకు గొప్ప ప్రశంసలు దక్కాయి.
ఈ కాంబోలో రెండవ సినిమా తెరకెక్కనున్నట్లు గతంలోనే ప్రకటన రాగా.. ఇటీవలే టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ టైటిల్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రానికి ఉగ్రం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించింది. ఈ షెడ్యూల్లో మేకర్స్ కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఈ చిత్రం కూడా పూర్తి స్థాయి సిరీయస్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’ విడుదలకు సిద్ధంగా ఉంది.