Hero | భార్యని వదిలేసి ప్రియురాలితో చెట్టాపట్టాల్.. స్టార్ హీరోని తిట్టిపోస్తున్న నెటిజన్స్
Hero | కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి రీసెంట్గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (ఆగస్టు 25) సింగర్ కెన్నీషాతో కలిసి తిరుమలకు వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి హాజరైన వీరి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Hero | కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి రీసెంట్గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (ఆగస్టు 25) సింగర్ కెన్నీషాతో కలిసి తిరుమలకు వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి హాజరైన వీరి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే భార్య ఆర్తితో విడాకుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కెన్నీషాతో కలిసి రవి మోహన్ పదే పదే పబ్లిక్‌లో కనిపించడం, వివాహ వేడుకలు, ఈవెంట్లతో పాటు ఆలయాలకు కూడా కలిసే రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు తిరుమల పర్యటనతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.
ప్రస్తుతం ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయితే కెన్నీషాతో కలిసి జయం రవి ఇలా తిరుమలలో కనిపించే సరికి నెటిజన్స్ అతనిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమెని వివాహం చేసుకునేందుకే భార్యకి విడాకులు ఇచ్చావా అని తిట్టిపోస్తున్నారు. మరోవైపు జయం రవి నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. రవి మోహన్ స్టూడియోస్‌ను చెన్నైలో ప్రారంభిస్తున్న సందర్భంగా తన ప్రియురాలు కెనీషాతో జయం రవి తిరుమలను సందర్శించినట్లు సమాచారం.నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయం రవి ఇప్పుడు నిర్మాతగా కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు.
అయితే జయం రవి–ఆర్తి మధ్య విడాకుల రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇటీవల జయం రవి తన భార్యతో కలిసి జీవించలేనని కోర్టుకి వివరించగా, రవి భార్య తనకు రూ.50 లక్షల భరణం కావాలని కోరింది. కెన్నీషా వల్లే తమ వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చాయని ఆర్తి ఆరోపిస్తుంది. నటుడు గణేష్ కుమార్తె వివాహంలో రవి, కెన్నీషా జంటగా కనిపించడంతో పాటు చేతులు పట్టుకొని కలియతిరిగారు. ఇదంతా చూస్తే మరి కొద్ది రోజులలో ఈ జంట పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం జయం రవి రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘కరాటే బాబు’ – గణేష్ కె బాబు దర్శకత్వంలో రూపొందుతుండగా, ‘పరాశక్తి’ – సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
‘ఈ 15 నుండి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె’
పదో తరగతి పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

