ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న క్రేజీ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్- అలియా భట్ జంట ఒకటి. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు. అంతేకాదు వీళ్లిద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు . 2020లో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని బాగా ప్రచారం జరగింది. అయితే కరోనా వలన వీరిద్దరి పెళ్లికి అవాంతరం ఏర్పడిందని తెలుస్తుంది. అతి త్వరలోనే వీరిరివురి పెళ్లికి సంబంధించి అఫీషియల్ ప్రకటన ఒకటి రానుందని సమాచారం.
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా ఈ జంట జోధ్‌పూర్‌లో వాలింది. అక్కడ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్న ఈ జంట పలు ఫొటోలు దిగారు. అయితే రణ్‌బీర్‌కి బర్త్ డే విషెస్ చెప్పే క్రమంలో అలియా భట్.. రణ్‌బీర్ భుజంపై తలపెట్టి కూర్చొని దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే మై లైఫ్” అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. అయితే అలియా సోదరి షహీన్ భట్ మరియు అతని సోదరి రిద్ధిమా కపూర్ సాహ్ని పోస్ట్ యొక్క కామెంట్ సెక్షన్స్‌లో హార్ట్ ఎమోజీలను పెట్టారు.
ప్రస్తుతం వీరిద్దరు ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, మౌనీ రాయ్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక అలియా.. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ అనే ప్రాజెక్ట్ ఇటీవల పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్‌కి జోడీగా అలియా నటించింది.