Alia Bhatt | ‘యానిమల్’ సినిమా చూసిన అలియాభట్‌కి ఆనందం అవధులు దాటింది. తన భర్త రణ్‌బీర్‌కపూర్ నటన చూసి పొంగిపోయింది అలియా. ఆ ఆనందాన్ని తన వ్యక్తిగత సోషల్‌మీడియా ద్వారా అందరితో పంచుకుంది. ‘యానిమల్’ చూశాను. ఆనందంతో మాట రావడంలేదు. వృత్తిపట్ల నీకున్న గౌరవం, ఇష్టం, ప్రేమ.. అన్నీ ఆ పాత్రలో కనిపించాయి. కెమెరా ఆన్‌లో ఉన్నా ఆఫ్‌లో ఉన్నా నువ్వు మాత్రం సూపర్‌స్టారే. నటనను ఎంత ప్రేమిస్తావో.. కుటుంబాన్ని కూడా అంతే ప్రేమిస్తావు. నీతోడు దొరకడం నా అదృష్టం.
ఈ రోజు మన పాప తొలి అడుగు వేసింది. ఓ వైపు నటుడిగా నువ్విచ్చిన ఆనందం, మరోవైపు తల్లిగా నా బిడ్డ ఇచ్చిన ఆనందం. నా జీవితంలో మరిచిపోలేని రోజు ఇది. అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించిన సందీప్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కొన్ని రోజులు ఈ ‘యానిమల్’ ఫీవర్ అలా ఉండిపోతుంది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది అలియాభట్.