Alia Bhatt | హాలీవుడ్‌కి బాలీవుడ్‌కి అదొక్కటే కష్టంగా అనిపించింది.. తన సమస్య చెప్పుకొచ్చిన ఆలియాభట్
Alia Bhatt | ఎలాంటి పాత్రలోనైనా తనదైన చక్కటి అభినయంతో మెప్పిస్తుంది బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్. కథల ఎంపికలో కూడా ఆమె కొత్తదనానికి పెద్దపీట వేస్తుంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్' అనే చిత్రం ద్వారా ఈ భామ హాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 11న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది.
Alia Bhatt | ఎలాంటి పాత్రలోనైనా తనదైన చక్కటి అభినయంతో మెప్పిస్తుంది బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్. కథల ఎంపికలో కూడా ఆమె కొత్తదనానికి పెద్దపీట వేస్తుంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే చిత్రం ద్వారా ఈ భామ హాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 11న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా తన తొలి హాలీవుడ్ సినిమా విశేషాలను పంచుకుంది అలియాభట్.
ఆమె మాట్లాడుతూ ‘బాలీవుడ్, హాలీవుడ్..ఎక్కడైనా షూటింగ్ వాతావరణం ఒకేలా ఉంటుంది. అయితే ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ షూటింగ్లో అమెరికా ఇంగ్లీష్ యాసను పలికించడం మాత్రం పెద్ద సవాలుగా అనిపించింది. నాకు ఇంగ్లీష్‌పై మంచి పట్టుంది. హిందీ సినిమా షూటింగ్స్‌లో కూడా ఇంగ్లీష్‌లోనే ఎక్కువగా మాట్లాడుకుంటాం. అయితే హాలీవుడ్ సినిమాలో నటించడం తొలిసారి కాబట్టి ఆ యాసలో డైలాగ్స్ చెప్పడం కష్టంగా అనిపించింది. ఓ వారం ప్రాక్టీస్ అనంతరం ఆ యాసపై పట్టు దొరికింది. ఒక్క యాస విషయంలో తప్ప హాలీవుడ్లో నాకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు’ అని చెప్పింది. అలియాభట్ నటించిన ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

