Ali | టాలీవుడ్ నటుడు అనురాగ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ప్రొడక్షన్ నంబర్ 1. పాపులర్ యాక్టర్ అలీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీడీ ప్రసాద్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా షురూ అయింది. ఈ మూవీలో సంతోష్, సాయి విక్రాంత్, చమ్మర్ చంద్ర, ఆటో రాంప్రసాద్, ఫణి, వినీత రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకనిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
ప్రసాద్ వర్మ చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. మంచి నిర్మాత సపోర్ట్ దొరికింది. ఈ మూవీలో విలక్షణమైన పాత్రతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నానని అనురాగ్ అన్నాడు. హన్ శివ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రాబోతున్న మొదటి సినిమా ఇదని ఈ సందర్భంగా అలీ అన్నాడు. ఇందులో తాను కూడా ఆసక్తికర పాత్రలో కనిపించబోతున్నానని చెప్పాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో అలీ ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపించబోతున్నాడని డైరెక్టర్ టీడీ ప్రసాద్ వర్మ చెప్పాడు. ఈ చిత్రాన్ని హన్ శివ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎన్ మహేశ్వరి, పీ జ్యోతి నిర్మిస్తున్నారు.
