Akshay Kumar | చిత్రపరిశ్రమలో.. బురద జల్లుకోవడం పరిపాటైపోయింది: అక్షయ్‌కుమార్
‘ఎదిగే వారిని సాటివాళ్లే కిందికి లాగడం సహజంగా పాలిటిక్స్‌లో జరుగుతుంటుంది. ఇప్పుడు చిత్రపరిశ్రమలో కూడా జరుగుతోంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్.
Akshay Kumar | ‘ఎదిగే వారిని సాటివాళ్లే కిందికి లాగడం సహజంగా పాలిటిక్స్‌లో జరుగుతుంటుంది. ఇప్పుడు చిత్రపరిశ్రమలో కూడా జరుగుతోంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్. ఆయన నటించిన ‘సర్ఫిరా’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మాట్లాడారు అక్షయ్‌కుమార్ ‘నాది 34ఏళ్ల కెరీర్. ఒప్పుకున్న సినిమాకోసం ఎంతకష్టాన్నయినా ఇష్టంగా అనుభవిస్తా.
నేను ఒకేసారి 17 సినిమాలకు పనిచేసిన రోజులున్నాయి. అవన్నీ 8నెలల కాలంలో విడుదలయ్యాయి. అది రికార్డ్. నేను హిట్స్ ఇస్తున్న రోజుల్లో నా గురించి అందరూ గొప్పగా మాట్లాడేవారు. ఇప్పుడు నా సినిమాలు కొన్ని ఫ్లాపులయ్యే సరికి వేరే విధంగా మాట్లాడుతున్నారు. పైగా కెరీర్‌కి ఇబ్బంది కలిగేలా కూడా ప్రవర్తిస్తున్నారు. వారెవరో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆలోచించను కూడా. పొలిటీషియన్స్ ఒకరినొకరు తిట్టుకున్నట్టు హీరో ఇంకో హీరోపై, దర్శకుడు మరో దర్శకుడిపై, అలాగే నిర్మాతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం పరిపాటైపోయింది. ఈ విధానం సమాజానికి మంచిది కాదు’ అంటూ వాపోయారు అక్షయ్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

