Naa Saami Ranga | టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం నా సామి రంగ (Naa Saami Ranga) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వంలో చేస్తున్న నటిస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. నాగార్జునను ఇదివరకెన్నడూ చూడని మాస్ అవతార్‌లో చూపించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మేకర్స్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభించారు. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్‌తో షూటింగ్ షురూ అయినట్టు సమాచారం. హైదరాబాద్‌లో వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో నాగార్జున, ఫైటర్స్ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.
కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని నా సామి రంగ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు. కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నాగార్జున ఈ సారి ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తున్నాడోనని ఆసక్తిగాఎదురుచూస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్.
జా.. జా.. జాతర.. ఇది గణపయ్య జాతర✨️❤️
Team #NaaSaamiRanga wishes all a #HappyVinayakaChavithi
WW Release on Sankranti 2024🤩@iamnagarjuna @ChoreographerVJ @mmkeeravaani @KumarBezwada @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/QP1bYIi9Ri
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 18, 2023