Akkineni Nagarjuna | అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ‘కాప్స్టన్ హోమ్ సర్వీసెస్’ యాప్ లాంఛ్!
Capstone Home Services | హైదరాబాద్ నగరంలో హోమ్ సర్వీసెస్ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ప్రముఖ సంస్థ 'కాప్స్టన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' సిద్ధమైంది.
Capstone Home Services | హైదరాబాద్ నగరంలో హోమ్ సర్వీసెస్ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ప్రముఖ సంస్థ ‘కాప్స్టన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ సిద్ధమైంది. B2B సేవల రంగంలో సుమారు రెండు దశాబ్దాలకు పైగా అప్రతిహతమైన అనుభవం కలిగి ఉన్న ఈ సంస్థ, తాజాగా ‘కాప్స్టన్ హోమ్ సర్వీసెస్’ పేరుతో సరికొత్త కన్స్యూమర్ యాప్‌ను అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ వేదికపై జరిగిన ఈ లాంచ్ ఈవెంట్‌కు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగార్జునను సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తూ, యాప్‌కు సంబంధించిన లోగోను ఆయన ఆవిష్కరించారు.
ఈ వైభవవంతమైన కార్యక్రమంలో కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్, రిటైర్డ్ IPS అధికారి డాక్టర్ సి.ఆర్. నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కోడాలి, పలువురు ప్రముఖులు, పరిశ్రమ భాగస్వాములు మరియు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఇల్లు అనేది కేవలం గోడల నిర్మాణం కాదని, అది స్వచ్ఛమైన నమ్మకంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అలాగే ఇంటికి వచ్చే ప్రతి సేవ కూడా అదే నమ్మకంతో, అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఎన్నో కార్పొరేట్ దిగ్గజ సంస్థలకు అద్భుతమైన మానవ వనరుల సేవలను అందిస్తూ నమ్మకం సంపాదించిన కాప్స్టన్ సంస్థతో ప్రయాణం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని నాగార్జున వెల్లడించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ హోమ్ సర్వీసెస్‌కు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. అయితే మార్కెట్లో ఇప్పటికీ నాణ్యమైన సిబ్బంది కొరత, భద్రతాపరమైన ఆందోళనలు, ధరల్లో పారదర్శకత లేకపోవడం వంటి సవాళ్లు వినియోగదారులను వేధిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ, కాప్స్టన్ సంస్థ తమ వద్ద ఉన్న 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవాన్ని, శిక్షణ పొందిన నైపుణ్య సిబ్బందిని ఈ యాప్ ద్వారా నేరుగా వినియోగదారుల ముందుకు తీసుకువస్తోంది. క్లీనింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటరీ, పెయింటింగ్, ఏసీ సర్వీసులు, గృహోపకరణాల మరమ్మతులు, పెస్ట్ కంట్రోల్, బ్యూటీ అండ్ వెల్నెస్ వంటి అనేక రకాల నిపుణుల సేవలను ఈ యాప్ ద్వారా చాలా సులభంగా పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా కాప్స్టన్ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ సి.ఆర్. నాయుడు మాట్లాడుతూ.. తాము అందిస్తున్న సేవల్లో పారదర్శకత, నాణ్యత, సమయపాలన తమ బ్రాండ్‌కు బలమని చెప్పారు. కస్టమర్ల నమ్మకమే తమ పెట్టుబడి అని, రాబోయే రోజుల్లో ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ కోడాలి మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో ప్రారంభమైన ఈ ప్రయాణం కేవలం మొదటి అడుగు మాత్రమేనని, రాబోయే రోజుల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు సహా దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ తమ సేవలను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. కేవలం సేవలను అందించడమే కాకుండా, దేశవ్యాప్తంగా వేలాది మంది నిపుణులకు ఉపాధి అవకాశాలను కల్పించడంలోనూ తాము ముందుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కస్టమర్లు పూర్తిగా వెరిఫైడ్ అయిన ప్రొఫెషనల్స్‌ను నమ్మకంతో బుక్ చేసుకునేలా ఈ యాప్‌ను అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన చేసినట్లు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

