అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య నాయిక. మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. యాక్షన్ స్పై థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం మనాలీలో షూటింగ్ జరుపుకుంటున్నది.
ఇక్కడ విజయ్ మాస్టర్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కిస్తున్నారు. మనాలీ షూటింగ్ సందర్భంగా చిత్రబృందం దిగిన కొత్త స్టిల్ విడుదల చేశారు. ఈ సినిమా కోసం కొత్తగా మేకోవర్ అయిన అఖిల్ ఆకట్టుకుంటున్నారు.
సినిమాలో ఆయన చేసే యాక్షన్ సీక్వెన్సులు ఆకర్షణ కాబోతున్నాయని చిత్ర బృందం చెబుతున్నారు. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ చిత్రానికి కథ : వక్కంతం వంశీ, సంగీతం : హిప్ హాప్ తమీజా, సినిమాటోగ్రఫీ : రసూల్ ఎల్లోర్, ఎడిటర్ : నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్ల.