Akhil- Zainab | అఖిల్-జైనబ్‌ల క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా?
Akhil- Zainab | అక్కినేని నాగార్జున - అమల దంపతుల కుమారుడు అఖిల్ వివాహం ఇటీవల జైనాబ్ రవ్జీతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 6వ తేదీన హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిపారు నాగార్జున. ఇక వివాహం తర్వాత జూన్ 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్- జైనాబ్ల వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది.
Akhil- Zainab | అక్కినేని నాగార్జున – అమల దంపతుల కుమారుడు అఖిల్ వివాహం ఇటీవల జైనాబ్ రవ్జీతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 6వ తేదీన హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో వీరి వివాహం గ్రాండ్‌గా జరిపారు నాగార్జున. ఇక వివాహం తర్వాత జూన్ 8వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్- జైనాబ్ల వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపారులు హాజరై నూతన జంటని ఆశీర్వదించారు. ఇక పెళ్లి తర్వాత అఖిల్, జైనబ్లకి సంబంధించిన అనేక విషయాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అఖిల్ కన్నా జైనబ్ 9సంవత్సరాలు పెద్దది అని కూడా చెబుతున్నారు.
అఖిల్ 1994లో జన్మించాడు. పెళ్లి సమయానికి ఈ హీరో వయసు 30 ఏళ్లు కాగా, జైనబ్ వయసు 39 ఏళ్లు ఉంటుంది. వీరిద్దరి మధ్య 9 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. తనకంటే పెద్ద వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోడంపై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఇక ఈ ఇద్దరి ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి కూడా నెట్టింట పలు వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. అఖిల్ తన ప్రాథమిక విద్యను చైతన్య విద్యాలయంలో ప్రారంభించాడు. అనంతరం రెండు సంవత్సరాలు ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చి, హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో తన స్కూలింగ్ పూర్తి చేశాడు.
అఖిల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా నుంచి BBA డిగ్రీ పొందాడు. విద్యను పూర్తి చేసిన అనంతరం, సినిమాల్లో ప్రవేశించాలనే లక్ష్యంతో న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. ఇక జైనబ్ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లోని గీతాంజలి స్కూల్ మరియు నాజర్ స్కూల్లో చదువుకుంది. తరువాత హ్యామ్స్టెక్ కాలేజ్ లో లలిత కళలలో డిగ్రీ పూర్తిచేసింది. ఆమె ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్, పర్ఫ్యూమ్ మేకర్, బ్లాగర్. కేవలం 7 ఏళ్ల వయసులోనే పెయింటింగ్ ప్రారంభించిన జైనబ్, ప్రముఖ కళాకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ వద్ద శిక్షణ పొందింది.హైదరాబాద్‌లో నిర్వహించిన ఆమె ఆర్ట్ ఎగ్జిబిషన్ ‘రిఫ్లెక్షన్స్’ పెద్ద విజయాన్ని సాధించింది. వన్స్ అపాన్ ద స్కిన్’ అనే బ్లాగ్‌ను కూడా నడుపుతుంది. ఆమెకు విస్తృతమైన దృక్పథం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- Amala
- Chiranjeevi
- Marriage
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

