Akhil | ‘అయ్యగారే నెం.1’ నినాదంపై అఖిల్ స్పందన.. నాకు నంబర్ వన్ కావాలనే లక్ష్యం లేదంటూ కామెంట్
Akhil | అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్' విడుదలకు సిద్ధమవుతోంది. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అఖిల్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన సినీ ప్రయాణం, అభిమానులతో ఉన్న అనుబంధం, కెరీర్‌పై తన ఆలోచనలను పంచుకుంటున్నారు.
Akhil | అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ విడుదలకు సిద్ధమవుతోంది. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అఖిల్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన సినీ ప్రయాణం, అభిమానులతో ఉన్న అనుబంధం, కెరీర్‌పై తన ఆలోచనలను పంచుకుంటున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో “అయ్యగారే నెం.1” అనే నినాదంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో “అయ్యగారే నెం.1″ అంటూ వైరల్ అయిన అభిమాని గురించి మాట్లాడుతూ అఖిల్ ఆనందం వ్యక్తం చేశారు. ఒక అభిమాని తనపై చూపించిన ప్రేమ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఎక్కడికి వెళ్లినా అందరూ ‘అయ్యగారు… అయ్యగారు’ అని పిలుస్తున్నారు. ఈ పేరు నాకు అభిమానులు ఇచ్చిన ప్రేమకు నిదర్శనం. నాన్న నాగార్జునకు ‘కింగ్’ అనే ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లే, నాకు ‘అయ్యగారు’ అనే పేరు సహజంగానే వచ్చేసింది. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు” అని అఖిల్ చెప్పారు. అభిమానులు తరచూ “అయ్యగారే నెం.1″ అని అనడం గురించి స్పందిస్తూ అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే ‘నంబర్ వన్’ కావాలనే లక్ష్యం నాకు లేదు. నంబర్ వన్ అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరికి నంబర్ వన్ అనిపించే వ్యక్తి, మరొకరికి కాకపోవచ్చు. అందుకే ఆ పోలికల గురించి నేను ఎక్కువగా ఆలోచించను” అని స్పష్టం చేశారు.
తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ తనకు మరింత బాధ్యతను పెంచుతుందని అఖిల్ అన్నారు. అభిమానులు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు, వారి అంచనాలను అందుకోవాలనే బాధ్యత కూడా నాపై ఉంటుంది. వారి ప్రేమ, ఉత్సాహం నాకు మరింత కష్టపడేలా ప్రేరణ ఇస్తాయి. వారిని ఎప్పుడూ నిరాశపరచకూడదనేదే నా ప్రయత్నం అని చెప్పారు. తెలుగు సినీ అభిమానుల్లో కొన్ని ప్రత్యేక నినాదాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని చెబుతూ, “జై బాలయ్య” తరహాలో “అయ్యగారే నెం.1” కూడా తనతో ఎప్పటికీ ముడిపడి ఉండిపోతుందని అఖిల్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో తన గత చిత్రాలైన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ గురించి కూడా అఖిల్ మాట్లాడారు. ఆ సినిమాల్లో తాను పోషించిన పాత్రలు మహిళలను గౌరవించే యువకులుగా ఉండటం తనకు ఎంతో నచ్చిందన్నారు. ముఖ్యంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలోని హర్ష పాత్ర గురించి మాట్లాడుతూ, ఆ పాత్రలో ఉన్న విలువలు ప్రతి అమ్మాయి కోరుకునే లక్షణాలు. అలాంటి పాత్ర చేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- Amala
- Chiranjeevi
- Lenin
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

