Akhil Akkineni Wedding | అఖిల్ అక్కినేని పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానాన్ని అందించిన నాగార్జున దంపతులు
Akkineni Nagarjuna | ప్రముఖ సినీ నటుడు నాగార్జున తన సతీమణి అమలతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తన కుమారుడు, యువ నటుడు అఖిల్ అక్కినేని వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అందజేశారు.
Akhil Akkineni Wedding | టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీలలో ఒకటైన అక్కినేని ఇంటా మరోసారి పెళ్లిబాజాలు మోగనున్నాయి. గతేడాది నాగార్జున పెద్ద కొడుకు నటుడు నాగచైతన్య – శోభితా పెళ్లి జరుగగా.. తాజాగా అతడి చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం జరగగా.. జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే తాజాగా అఖిల్ వెడ్డింగ్ కార్డుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశాడు నాగార్జున.
శనివారం ఉదయం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన నాగార్జున, అమల దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అఖిల్ వివాహ శుభలేఖను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. అఖిల్ వివాహ ఏర్పాట్లు, సినీ విశేషాలపై సంభాషించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగార్జున దంపతులను ఆప్యాయంగా పలకరించి, అఖిల్‌కు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
అక్కినేని కుటుంబం నుండి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అఖిల్ ‘సిసింద్రీ’ (1994) చిత్రంతో బాలనటుడిగా వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత ‘అఖిల్’ (2015) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించిన కూడా ఇప్పటివరకు కెరీర్లో ఒక్క హిట్టు కూడా నమోదు చేయలేదు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం అఖిల్ ‘లెనిన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
Read more
-
ఆయుధ వ్యాపారిగా మారిన రెజ్లర్.. 8 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు
-
రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
-
విద్వేష ప్రసంగం కేసులో దోషిగా తేలిన ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

