Akhil Akkineni Next Movie | ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటివరకు కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాడు అక్కినేని అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో తొలిహిట్ అందుకున్నా.. కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేకపోయిడు. దాంతో రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఏజెంట్‌తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. తీరా రిలీజయ్యాక డిజాస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. పాత కథలనే రుబ్బి మళ్లీ చూపించాడనే మచ్చను సురేందర్ రెడ్డి తెచ్చుకున్నాడు. ఆయన స్టైల్ మేకింగ్ గానీ, విజన్ గానీ ఒక్క సీన్లోనూ కనిపించలేదు. ప్రేక్షకులనే కాదు.. అక్కినేని అభిమానులను సైతం ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.
రెండేళ్లుగా ఒళ్లు హూనం చేసుకుని.. ఎంతో కష్టపడిన అఖిల్‌ను ఈ సినిమా ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సారి ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనుకున్న అఖిల్ కల.. కలగానే మిగిలిపోయింది. ఇక ఇదిలా ఉంటే అఖిల్ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అఖిల్ తదుపరి సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే అఖిల్‌కు ఓ మాస్ కథను చెప్పగా.. అఖిల్‌కు కథ బాగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎలాగో నారప్పతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరున్న శ్రీకాంత్ అడ్డాల మాస్ సబ్జెక్ట్‌ను కూడా డీల్ చేయడంలోనూ దిట్ట అని నిరూపించాడు. ఇక ఇప్పుడు పెద్ద కాపు అనే ఓ మాస్ కమర్షియల్ సినిమా తీస్తున్నాడు.
ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ ఓ రేంజ్లో అంచనాలు నెలకొల్పాయి. ఇక ఇప్పుడు అఖిల్‌తో కూడా అలాంటి ఓ మాస్ సినిమానే ప్లాన్ చేస్తున్నాడట. అన్నీ కుదిరితే ఇదే ఏడాది చివర్లో సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉంది. ఇక అఖిల్ యూవీ క్రియేషన్స్‌లో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయిపోయిందని ఇన్సైడ్ టాక్. సాహో సినిమాకు ఆసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తుంది. మరి ముందుగా ఏ సినిమా పట్టాలెక్కుతుందో చూడాలి.