కాస్త ఆలస్యంగా లెనిన్
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న రాయలసీమ గ్రామీణ నేపథ్య యాక్షన్ డ్రామా ‘లెనిన్'. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న రాయలసీమ గ్రామీణ నేపథ్య యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ముందుస్తు షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెల 26న విడుదల కావాల్సి ఉంది. తాజాగా ఈ సినిమా రెండు వారాలు వాయిదా పడింది. జూలై 10న విడుదల చేయబోతున్నట్లు నాగార్జున తన సోషల్మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. సృజనాత్మకంగా, సాంకేతికంగా ఈ సినిమాను మరింత ఉన్నతీకరించి, అదనపు హంగులు జోడించే లక్ష్యంతో చిత్రబృందం మరికాస్త సమయం కోరిందని, వారి అభ్యర్థన మేరకు కొత్త విడుదల తేదీని ప్రకటించామని అక్కినేని నాగార్జున తెలిపారు.
‘లెనిన్’లో సరికొత్త అఖిల్ను చూస్తారని, ‘మనోడు 10న వస్తున్నాడు’ అంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. గ్రామంలోని ఆధిపత్య పోరు, సామాజిక అంశాల నేపథ్యంలో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో, సంగీతం: తమన్, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్, రచన-దర్శకత్వం: మురళీకిషోర్ అబ్బూరు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

