తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉన్న కథానాయకుల్లో అజిత్ ఒకరు. ఆయన నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదల కానుంది. యాక్షన్ చిత్రాల్ని తెరకెక్కించడంతో ప్రత్యేకత కనబరిచే హెచ్. వినోద్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ముస్తాబవుతున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో విడుదల కాబోతున్నది.
అజిత్ గత చిత్రం ‘వలిమై’ తెలుగులో ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేదు. తమిళ టైటిల్‌తోనే ఆ సినిమాను విడుదల చేయడం కూడా మైనస్‌గా మారింది. ఈ నేపథ్యంలో అజిత్ తాజా చిత్రానికి తెలుగు టైటిల్‌ను ఖరారు చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.