Ajay Devgn | బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar 2). విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్ థాకుర్ కథానాయికగా నటించబోతుంది.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న(Maryada Ramanna) సినిమాను హిందీలో సన్ ఆఫ్ సర్దార్ (Son Of Sardaar) అని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమాకు సన్ ఆఫ్ సర్దార్ 2 అంటూ సీక్వెల్‌ను తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను పంచుకుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే స్కాట్లాండ్లో ఈ మూవీ కథ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అనుకోకుండా స్కాట్లాండ్ వెళ్లిన జస్సీ సర్దార్ అక్కడ ఎలాంటి సమస్యల్లో పడ్డాడు అనేది ఈ మూవీ కథ. ఇక ఈ సినిమాను జూలై 25న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.