సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మించిన ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ను బుధవారం అగ్ర హీరో అజయ్ దేవ్గన్ తన కుమారుడు యుగ్ దేవ్గన్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సినిమాలో జాకీచాన్ పోషించిన మిస్టర్ హాన్ పాత్రకు అజయ్ దేవ్గన్, లీఫాంగ్ పాత్రకు యుగ్దేవ్గన్ హిందీలో డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే.
తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా తెరకెక్కిన ఈ కథకు వారిద్దరి డబ్బింగ్ హైలైట్గా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ‘కరాటే కిడ్: లెజెండ్స్’ చిత్రాన్ని న్యూయార్క్ నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు. స్ఫూర్తివంతమైన కథతో ఈ సినిమా భారతీయ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ నెల 30 ఈ చిత్రం విడుదలకానుంది.