Shaitaan Teaser | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటులు ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షైతాన్. ఈ సినిమాకు క్వీన్, సూపర్ 30, గుడ్ బై లాంటి చిత్రాలను తీసిన వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదలకు ఇంకా నెల రోజులు ఉండటంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఇక ఈ టీజర్ గమనిస్తే.. బ్లాక్ మ్యాజిక్ ఆధారంగా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తుంది. వెకేషన్ కోసం మారుమూల గ్రామానికి వెళ్లిన ఓ కుటుంబం.. అపరిచిత వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడుతుంది. అతను ప్రయోగించిన బ్లాక్ మ్యాజిక్ నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది అనేది అసలు కథ. జియో స్టూడియోస్ సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్పాండే, అభిషేక్ పాఠక్ ఈ సినిమాను సంయక్తంగా నిర్మిస్తున్నారు.