AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
AICWA | బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. నటుడు నానా పటేకర్ మరణంపై ఆమె స్పందిస్తూ ఉపయోగించిన ‘ఈవిల్ డెడ్’ అనే పదంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఒక వ్యక్తి మరణించిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.
AICWA | బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. నటుడు నానా పటేకర్ మరణంపై ఆమె స్పందిస్తూ ఉపయోగించిన ‘ఈవిల్ డెడ్’ అనే పదంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఒక వ్యక్తి మరణించిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏఐసీడబ్ల్యూఏ అధ్యక్షుడు సురేష్ శ్యామలాల్ గుప్తా ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. నానా పటేకర్ మరణవార్తపై తనుశ్రీ దత్తా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఏఐసీడబ్ల్యూఏ పేర్కొంది. నానా పటేకర్ సినీ రంగానికి చేసిన సేవలను, ఆయనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని, ‘నామ్ ఫౌండేషన్’ ద్వారా రైతు కుటుంబాలకు అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆయన కుటుంబం దుఃఖంలో ఉంటుందని, అలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని సంఘం అభిప్రాయపడినంది. తనుశ్రీ ఉపయోగించిన పదజాలాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి సందర్భాల్లో మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. నానా పటేకర్ మరణవార్త విన్నానంటూ తనుశ్రీ దత్తా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకోగా, అందులో ఆ రోజు లక్నోలో ఓ ముఖ్యమైన కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉందని, దానిపైనే దృష్టి పెట్టాలని భావించానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే సాయంత్రానికి మీడియా మొత్తం ‘ఈవిల్ డెడ్’ అంశంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో నానా పటేకర్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొంది.
నానా పటేకర్, తనుశ్రీ దత్తా మధ్య గతంలోనూ వివాదం చోటుచేసుకుంది. 2018లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనతో అనుచితంగా ప్రవర్తించారని తనుశ్రీ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను నానా పటేకర్ ఖండించారు. ఈ వివాదం అప్పట్లో బాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం తనుశ్రీ వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడటంతో మరోసారి ఈ ఇద్దరి పేర్లు చర్చలోకి వచ్చాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

